ఝార్ఖండ్‌ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం

64చూసినవారు
ఝార్ఖండ్‌ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం
ఝార్ఖండ్‌ సీఎంగా జేఎంఎం నేత హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి విజయం సాధించడంతో జార్ఖండ్ 14వ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, జేఎంఎం అధ్యక్షుడు శిబూ సోరెన్‌, మమతా బెనర్జీ, భగవంత్‌ మాన్‌, అఖిలేశ్‌ యాదవ్‌, కేజ్రీవాల్‌, భట్టి విక్రమార్క, డీకే శివకుమార్‌, ఉదయనిధి స్టాలిన్‌, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ తదితరులు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్