BREAKING: మోహన్ బాబు ఇంట వివాదం.. కీలక మలుపు
TG: నటుడు మోహన్ బాబు కుటుంబం మధ్య నెలకొన్న వివాదంలో కీలక మలుపు చోటుచేసుకుంది. శంషాబాద్‌లోని జల్పల్లి నివాసం నుంచి మంచు మనోజ్‌ని పంపించాలని తండ్రి మోహన్‌బాబు నిర్ణయించారు. ఇటీవల జరిగిన గొడవల దృష్ట్యా మనోజ్ ఇంట్లో ఉండటం కుదరదని తేల్చి చెప్పారు. కాగా, మనోజ్ కూడా బయలుదేరాలని నిర్ణయించుకున్నాడు. అతని వస్తువులను తరలించడానికి 3 భారీ వాహనాలు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎలాంటి గొడవలు కాకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.