
పరారీలో మాజీ మంత్రి కాకాణి!
AP: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనను విచారించేందుకు పోలీసులు 3 సార్లు నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్లో కుటుంబానికి సంబంధించిన శుభకార్యంలో పాల్గొని నెల్లూరుకు వస్తానని చెప్పిన కాకాణి.. అనంతరం అందుబాటులో లేకుండా పోయారు. కాకాణిని అరెస్ట్ చేయడానికి రెండు ప్రత్యేక బృందాలను హైదరాబాద్కు పంపించి ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఎక్కడున్నారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.