ALERT: మరో 3 రోజులు వర్షాలు

64చూసినవారు
ALERT: మరో 3 రోజులు వర్షాలు
AP: రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మూడు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం అల్లూరి, కాకినాడ, తూ.గో, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయంది. ఆదివారం ఉత్తరాంధ్రలో తేలికపాటి వర్షాలు, కాకినాడలో మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. సోమవారం అల్లూరి, కాకినాడ, తూ.గో, ఏలూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

సంబంధిత పోస్ట్