మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 5న చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, CSKకు మధ్య జరిగే మ్యాచ్‌కు ధోనీ కెప్టెన్సీ వహించే అవకాశాలు ఉన్నాయి. గత మ్యాచ్‌లో గాయపడ్డ రుతురాజ్ గైక్వాడ్ పూర్తిస్థాయిలో కోలుకోకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. రేపటి మ్యాచ్‌లో ధోనీ కెప్టెన్‌గా ఉండొచ్చని మైఖేల్ హస్సీ సైతం హింట్ ఇచ్చారు.