నమన్ ధీర్‌ను బౌల్డ్ చేసి స్లెడ్జింగ్‌కు పాల్పడ్డ దిగ్వేశ్‌ (వీడియో)

82చూసినవారు
IPL-2025లో భాగంగా లక్నో వేదికగా శుక్రవారం ముంబై ఇండియన్స్‌‌తో జరిగిన మ్యాచ్‌లో LSG విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా ఈ మ్యాచ్ లో దూకుడుగా ఆడిన ముంబై బ్యాటర్ నమన్ ధీర్‌(46)ను బౌల్డ్ చేసిన వెంటనే LSG బౌలర్ దిగ్వేశ్‌ రాఠీ మరోసారి స్లెడ్జింగ్‌కు పాల్పడ్డారు. పంజాబ్ జట్టుతో జరిగిన గత మ్యాచ్‌లోనూ దిగ్వేశ్‌ రాఠీ ఇదే విధంగా ప్రవర్తించారు. అప్పుడు తన మ్యాచ్‌ ఫీజులో 25 శాతం ఫైన్ పడింది. అయినా అతడు మారలేదు.

సంబంధిత పోస్ట్