AP: మాజీ మంత్రి విడదల రజిని చుట్టూ ఏసీబీ ఉచ్చు బిగిస్తోంది. విజిలెన్స్ తనిఖీల పేరుతో స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేసిన కేసులో ఆమెతో పాటు తదితరులప పదేళ్ల వరకు జైలు శిక్షకు వీలున్న ఐపీసీ సెక్షన్ 386ని చేర్చినట్లు ఏసీబీ తరఫున ఏజీ దుమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు నివేదించారు. శుక్రవారం జరిగిన విచారణలో పిటిషనర్ల తరఫున వాదనలు ముగిశారు. ఏజీ దుమ్మాలపాటి వాదనల కోసం ఈ నెల 8కి విచారణ వాయిదా పడింది.