మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మ
బతుకమ్మ వేడుకల్లో మూడో రోజైన ఆశ్వయుజ శుద్ధ విదియ నాడు జరుపుకొనే బతుకమ్మను ‘ముద్దపప్పు బతుకమ్మ’ అని పిలుస్తారు. ఇవాళ మూడు ఎత్తుల్లో పూలను పేర్చి, శిఖరం మీద గౌరమ్మను ఉంచుతారు. చామంతి, మందార తదితర పూలను ఉపయోగిస్తారు. ఇలా చేస్తే ఆరోగ్యం , బోగభాగ్యాలు కలుగుతాయని తెలంగాణ ప్రజల విశ్వాసం. ఈ రోజు ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేస్తారు.