మంత్రి కొండా సురేఖ సమంత-నాగ చైతన్యల విడాకులపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదమవుతున్నాయి. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు మంత్రి వ్యాఖ్యలను ఖండించారు. తాజాగా ఆమె వ్యాఖ్యలపై రామ్ చరణ్ స్పందించారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు బాధ్యతా రాహిత్యంగా ఉన్నాయని, నిరాధారమైనవని రామ్ చరణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.