
వంశీని వైసీపీ వదిలేసినట్లేనా?
AP: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వైసీపీ పూర్తిగా వదిలేసినట్లు తెలుస్తోంది. గన్నవరంతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో వంశీ చేసిన అక్రమాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. పాత కేసులను బయటకు తీస్తున్నారు. అయితే వల్లభనేని వంశీ కస్టడీలో ఉన్నారు. కానీ ఆయన అరెస్ట్‌పై వైసీపీ అధిష్టానం గానీ, వైసీపీ సోషల్ మీడియా గానీ స్పందించలేదు. వైసీపీ నేతలందరూ సైలంట్ అవ్వడంతో.. వంశీని పార్టీ వదిలేసినట్లు టాక్ వినిపిస్తోంది.