TG: అత్తింటి వారి వేధింపులు భరించలేక HYD డబీర్‌పురలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. తహనజర్ బేగంకు నాగబౌలి ప్రాంతానికి చెందిన అమీర్‌తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే, భర్త, అత్త, ఆడపడుచు, తోటి కోడళ్లు తహనజర్ బేగంను కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నారు. విసిగిపోయిన ఆమె చనిపోయే ముందు తన తల్లికి ఫోన్ చేసి ‘అమ్మా ఇక నా వల్ల కాదు, నేను చనిపోతున్నా’ అని చెప్పి ఫ్లైఓవర్‌పై నుంచి దూకి సూసైడ్ చేసుకుంది.