TG: మేడ్చల్ జిల్లా గౌడవెల్లిలో క్రికెట్ బెట్టింగ్‌లో నష్టపోయి సోమేశ్ అనే యువకుడు రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సోదరి వివాహం కోసం దాచిన డబ్బులతో పాటు IPLలో ఒక్కరోజే లక్ష పోగొట్టుకున్నాడు. దీంతో 'నేను సూసైడ్ చేసుకోవాలని డిసైడయ్యా. డబ్బుల విషయంలో ఆత్మహత్యకు పాల్పడడం లేదు. నా మైండ్ సెట్ కంట్రోల్ కావడం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. అమ్మానాన్న, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సారీ' అని స్టేటస్ పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు.