మహిళలపై రాళ్లతో దాడి జరిగిన ఘటన యూపిలో చోటుచేసుకుంది. మొరాదాబాద్‌లో ఆలయంలో కీర్తనలు చేస్తున్న రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణలో భాగంగా మహిళలపై ఇతర వర్గాల వ్యక్తులు కొట్టి, రాళ్లు రువ్వారని పలువురు ఆరోపించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పి, అక్కడి నుంచి పంపించేశారు. అయితే ఇరువర్గాల గొడవకు గల కారణాలు తెలియాల్సి ఉంది.