14న సాగు నీటి సంఘాల ఎన్నికలు
AP: సాగు నీటి సంఘాల ఎన్నికలకు ప్రభుత్వం రంగం సిద్ధమైంది. ఈ నెల 14న నీటి వినియోగదారుల సంఘాలకు, 17న డీసీలు (డిస్ట్రిబ్యూటరీ కమిటీ) ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల తర్వాత షెడ్యూల్ ప్రకారం ప్రాజెక్టు కమిటీ ఎన్నికలు జరగాలి. కానీ ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడగా.. ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.