పర్యావరణ ప్రేమికుడిని స్తంభానికి కట్టేసి కొట్టారు (వీడియో)

60చూసినవారు
AP: పర్యావరణ పరిరక్షణ, నీటి కాలుష్యంపై ఓ యువకుడు చేసిన పోరాటం అతడికి శాపంగా మారింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లిలో ఆక్వా పరిశ్రమకు పెట్టింది పేరు. ఈ క్రమంలో గ్రామ యువకులు ఆక్వా సాగుకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. వారు హైకోర్టును ఆశ్రయించడంతో చెరువులు మూతపడ్డాయి. తాజాగా సోమవారం ఆక్వా సాగుకు కొందరు సిద్ధమయ్యారు. ఫొటోలు తీసేందుకు వెళ్లిన దుర్గాప్రసాద్‌ను ఆక్వా రైతులు స్తంభానికి కట్టి కొట్టారు.

సంబంధిత పోస్ట్