AP: 30 మంది జవాన్లను కాపాడి ఆర్మీ జవాన్ వీరమరణం పొందారు. జమ్మూలో నియంత్రణ రేఖ వద్ద విధి నిర్వహణలో ఉన్న ఆర్మీ జవాన్ ల్యాండ్‌మైన్ పేలి దుర్మరణం పాలయ్యారు. ప్రకాశం జిల్లా రావిపాడుకు చెందిన వరికుంట్లు సుబ్బయ్య (945) జమ్మూలోని పూంచ్ జిల్లాల్లో సరిహద్దు వద్ద విధులు నిర్వహిస్తున్నారు. అయితే అక్కడ ల్యాండ్‌మైన్‌ను గుర్తించిన ఆయన.. తోటి జవాన్లను దూరంగా పంపించారు. ఒక్కసారిగా ల్యాండ్‌మైన్ పేలడంతో సుబ్బయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.