AP: పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్ యజమానులను బెదిరించి మాజీ మంత్రి విడదల రజిని, ఐపీఎస్ అధికారి పల్లె జాషువా రూ.2.20 కోట్లు అక్రమంగా వసూలు చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం పేర్కొంది. విడదల రజిని రూ.2 కోట్లు, జాషువా రూ.10 లక్షలు, రజిని పీఏ రూ.10 లక్షలు తీసుకున్నట్లు నిర్ధారించింది. వీరందరిపైనా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిఫార్సు చేసింది. ఈ మేరకు తాజాగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.