ఏపీ రాజకీయాల్లో రోజా అంటేనే ఫైర్. అధికారంలో ఉన్నప్పుడు ఆమె చేసిన హడావిడి ఓ రేంజ్‌లో ఉండేవి. అయితే ఈ మధ్యకాలంలో రోజా రాజకీయాల నుంచి పూర్తిగా దూరమైనట్లు తెలుస్తోంది. చెన్నై కాదంటే హైదరాబాద్‌లో ఉంటున్నారు తప్ప.. నగరిని పూర్తిగా మర్చిపోయారనే టాక్ వినిపిస్తోంది. రాజకీయంగా ఇబ్బందులు తప్పవని ముందే గ్రహించి.. ఆమె రూట్ మార్చేసినట్లు చెప్పుకుంటున్నారు. పార్టీ కోరితే తప్ప తనకు తానుగా బయటకు వచ్చి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం లేదని సమాచారం.