ఏపీలో కేబుల్ ఆపరేటర్లకు గుడ్ న్యూస్
ఏపీ ఫైబర్ నెట్ రాష్ట్రంలోని కేబుల్ ఆపరేటర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. కేబుల్ ఆపరేటర్లపై విధించిన రూ.100 కోట్ల పెనాల్టీలను రద్దు చేస్తున్నట్లు ఏపీ ఫైబర్ నెట్ సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి వెల్లడించారు. సెట్‌టాప్ బాక్స్ అద్దె కింద ఆపరేటర్ల నుంచి ప్రతి కనెక్షన్‌కు నెలకు రూ.59 చొప్పున రెంట్ కూడా రద్దు చేస్తామని, ఇకపై కనెక్షన్లపై రెంట్లను వసూలు చేయబోమని ప్రకటించారు.