AP: కడప జిల్లా కమలాపురంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ ఆయాసంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రయాణికులు ఆ విషయాన్ని ఆర్టీసీ డ్రైవర్‌కు చెప్పడంతో.. బస్సును ఆస్పత్రి వైపు వేగంగా తీసుకెళ్లారు. ఆస్పత్రిలో మహిళను జాయిన్ చేయించారు. అస్వస్థతతో ఉన్న మహిళను సమయానికి ఆస్పత్రిలో చేర్పించడంతో అక్కడున్న ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. శభాష్ డ్రైవరన్న అంటూ అభినందించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.