దావోస్ నుంచి నేరుగా ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. కారణమిదే?

52చూసినవారు
దావోస్ నుంచి నేరుగా ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. కారణమిదే?
AP: దావోస్ పర్యటన ముగించుకొని సీఎం చంద్రబాబు నేరుగా ఢిల్లీకి వెళ్లారు. ఫిబ్రవరి 1న కేంద్రం 2024-25 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఇదే సమయంలో ఏపీకి కేటాయింపులపైన చంద్రబాబు ఢిల్లీ పెద్దలతో చర్చలు జరపనున్నారు. పోలవరం, బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు నిధుల అంశాన్ని కేంద్రం వద్ద ప్రస్తావించనున్నారు. ఆర్థిక, జలవనరుల శాఖ మంత్రులను కలిసి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలు అందించనున్నారు.

సంబంధిత పోస్ట్