ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు నివాసంలో ఐటీ అధికారుల మరోసారి సోదాలు చేస్తున్నారు. మహిళా అధికారి ఆధ్వర్యంలో తనిఖీలు జరుగుతున్నాయి. దిల్ రాజు నివాసం, కార్యాలయాల్లో మంగళవారం నుంచి సోదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆర్థిక లావాదేవీలు, పన్ను చెల్లింపులకు సంబంధించిన పలు కీలక పత్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. మరోవైపు దిల్ రాజు సోదరుడు శిరీశ్ నివాసంలో సోదాలు ముగిశాయి.