Top 10 viral news 🔥

టెన్త్ ఎగ్జామ్ సరిగా రాయలేదని.. ప్రాణాలు తీసుకున్న విద్యార్థిని
TG: పదో తరగతి పరీక్ష సరిగా రాయలేదని ఓ విద్యార్థిని ప్రాణాలు తీసుకుంది. నల్గొండ జిల్లా కట్టంగూర్కు చెందిన పూజిత భార్గవి(15) ప్రస్తుతం టెన్త్ పరీక్షలు రాస్తోంది. సోమవారం జరిగిన ఇంగ్లిష్ ఎగ్జామ్ సరిగా రాయలేదని మనస్తాపానికి గురైన భార్గవి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పరీక్షలే జీవితం కాదని.. ఇలాంటి ఘటనలు జరగకుండా విద్యార్థులకు అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు.