సినిమా రంగంలో ఎవరితోనూ పోటీ పడనని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడులో నిర్వహించిన ‘పల్లె పండుగ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అభిమానులు ‘ఓజీ’ నినాదాలు చేస్తుండటంతో ఆయన స్పందించారు. 'ముందు బాధ్యత.. ఆ తర్వాత వినోదం. సినిమాల్లో ఎవరితోనూ పోటీ పడను. ఒక్కో స్థాయిలో ఒక్కొక్కరు నిష్ణాతులు. బాలకృష్ణ, చిరంజీవి, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్, నాని.. ఇలా అందరూ బాగుండాలి' అని వ్యాఖ్యానించారు.