తేనెటీగల దాడిలో చిన్నారి మృతి

80చూసినవారు
తేనెటీగల దాడిలో చిన్నారి మృతి
AP: తేనెటీగల దాడిలో చిన్నారి మృతి చెందిన ఘటన అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలం ఎగకంటవరంలో చోటు చేసుకుంది. చెట్ల వద్ద ఆడుకుంటున్న అన్నాచెల్లెలిపై తేనెటీగలు దాడి చేశాయి. గాయాలపాలైన వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించగా.. చెల్లెలు వంతల గౌరి (4) చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఆమె సోదరుడు విశ్వ (10)కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్