వర్క్ ఫ్రమ్ హోమ్‌కు స్వస్తి పలకాలని అమెజాన్ ఏడబ్ల్యూఎస్ సీఈఓ మాట్ గార్మాన్ వెల్లడించారు. వారంలో ఐదు రోజులు తప్పనిసరిగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని సూచించారు. ఆఫీసు వాతావరణంలో పనిచేయడానికి ఇష్టపడనివారు, వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలనుకొనేవారికి ఇతర కంపెనీలు ఉన్నాయంటూ గర్మాన్ హెచ్చరించారు.