
రేపు దేశీయ స్టాక్ మార్కెట్లకు సెలవు
హోలీ పండుగ సందర్భంగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) శుక్రవారం పని చేయవు. దీంతో ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్, సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ బారోయింగ్ (SLB) విభాగాలలో ట్రేడింగ్ ఉండదు. కరెన్సీ డెరివేటివ్స్ విభాగంలో ట్రేడింగ్ కూడా మార్చి 14న నిలిపివేయబడుతుంది. ఇక శని, ఆదివారాలు కూడా సెలవు కాబట్టి వరుసగా మూడు రోజులు తర్వాత సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు పనిచేస్తాయి.