ఒడిశాలో విచిత్ర కేసు నమోదైంది. బాగా తాగుతున్నారని భర్తలపై భార్యలు ఫిర్యాదు చేసేది పోయి, ఉల్టా భర్తలే తమ భార్యలు ఫుల్లుగా తాగుతున్నారని PS మెట్లు ఎక్కారు. కొరాపుట్ జిల్లా కొండగూడలో తమ భార్యలు మద్యానికి బానిసలు అయ్యారని, తాము కష్టపడి కూలి చేస్తూ డబ్బులు సంపాదిస్తుంటే, ఆ డబ్బులతో మందు తాగుతున్నారని భర్తలు ఫిర్యాదు చేశారు. గ్రామంలో నాటుసారా విపరీతంగా తయారు చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.