నా గొంతును ఇంకా బలంగా వినిపిస్తా: మాజీ మంత్రి (వీడియో)

69చూసినవారు
TG: అసెంబ్లీలో స్పీకర్‌ను కించపరచలేదని, కేవలం ప్రభుత్వాన్ని మాత్రమే నిలదీశానని బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ నుంచి తనపై సస్పెన్షన్ వేటు పడటంతో కేటీఆర్, హరీష్ రావులతో కలిసి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. సభలో అందరికీ సమాన హక్కులున్నాయని చెప్పినందుకే సస్పెండ్ చేశారని, స్పష్టమైన కారణం లేదని ఆరోపించారు. ఇప్పటినుంచి నా గొంతును ఇంకా బలంగా వినిపిస్తానని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్