TG: జగిత్యాల జిల్లాలో ఓ యువకుడు హల్‌చల్ చేశాడు. శివరామ్ అనే యువకుడు గత కొన్ని రోజులుగా తన భార్య కాపురానికి రాకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో అతను మద్యం సేవించి, జిల్లా పోలీస్ స్టేషన్ ఎదుట మద్యం మత్తులో ఉన్న శివరామ్ బీరు సీసాతో తన తలకు గాయం చేసుకున్నాడు. ఈ విషయంపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లినప్పటికీ, పోలీసులు అతని ఫిర్యాదును పట్టించుకోలేదని ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశాడు.