AP: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 15 గంటల సమయం పడుతోంది. మాఘ మాసం, పెళ్లిళ్ల సీజన్ కావడంతో మాఘ స్వామి వారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ క్రమంలో 27 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు దర్శనం కోసం వేచి చూస్తున్నారు. అయితే ఆదివారం దాదాపు 84,536 మంది స్వామి వారిని దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.