దేవాదుల నీటి ఎత్తిపోతలకు బ్రేక్ పడింది. ఫేస్1, ఫేస్3 పైప్‌లైన్లలో లీకేజీ సమస్య ఏర్పడింది. ఫేస్1లో ఉనికిచెర్ల–ధర్మసాగర్ మధ్య, ఫేస్3లో ధర్మసాగర్ రిజర్వాయర్ వద్ద టన్నెల్‌లో లీకేజీ జరిగింది. దీంతో అధికారులు పంప్ హౌస్ మోటార్లను నిలిపివేశారు. మరమ్మత్తుల కోసం లీకేజీ ప్రాంతంలో నీటిని తొలగించే పనులు చేస్తున్నారు.