రెస్టారెంట్లు, హోటళ్లలో సేవా ఛార్జీ (Service Charge) విధించడం తప్పనిసరి కాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. సేవా ఛార్జీ లేదా టిప్ (Tip) కేవలం వినియోగదారుడి స్వచ్ఛంద నిర్ణయం మాత్రమేనని కోర్టు వెల్లడించింది. ఈ మేరకు హోటళ్లు, రెస్టారెంట్లు సేవా ఛార్జీని బలవంతంగా వసూలు చేయడానికి వీలులేదని తీర్పు ఇచ్చింది. వినియోగదారులు సంతృప్తిగా ఉన్నప్పుడు మాత్రమే తమ ఇష్టప్రకారం టిప్ ఇవ్వొచ్చని కోర్టు పేర్కొంది.