17 ఏళ్లుగా మహిళ కడుపులో ఉన్న కత్తెర తొలగింపు

54చూసినవారు
17 ఏళ్లుగా మహిళ కడుపులో ఉన్న కత్తెర తొలగింపు
UP లక్నోలోని ఒక నర్సింగ్ హోమ్‌లో 17 ఏళ్ల క్రితం ప్రసవం సమయంలో సిజేరియన్ చేయించుకున్న ఓ మహిళ కడుపులో శస్త్రచికిత్సకు ఉపయోగించే కత్తెర కనిపించింది. 17 ఏళ్ల నుంచి తన భార్య కడుపునొప్పితో బాధపడుతోందని ఆమె భర్త తెలిపారు. ఎక్కడకు వెళ్లినా నయం కాలేదని చెప్పారు. చివరకు లక్నోలోని మెడికల్ కాలేజీలో చేసిన ఎక్స్‌రేలో కడుపులో కత్తెర ఉన్నట్లు తేలింది. డాక్టర్లు శస్త్రచికిత్స చేసి కత్తెరను తొలగించారు.

సంబంధిత పోస్ట్