ఆస్ట్రేలియాలోని వాకా స్టేడియం వేదికగా జరిగిన భారత జట్టు వార్మప్నకు సంబంధించి వీడియోను బీసీసీఐ తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది. బౌన్సీపిచ్పై బంతిని ఎదుర్కోవడంలో రుతురాజ్ గైక్వాడ్ నాణ్యమైన ఆటతీరు ప్రదర్శించాడు. తొలుత విరాట్ 15 పరుగులకే ఔట్ కాగా.. మళ్లీ రెండోసారి బ్యాటింగ్‌కు దిగి 30 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. జస్ప్రీత్ బుమ్రా 18 ఓవర్లు బౌలింగ్ చేశాడు.