వేములవాడలో అభివృద్ధి పనులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.127.65 కోట్లు మంజూరు చేసింది. శ్రీరాజరాజేశ్వర ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తుల సదుపాయాలకు రూ.76 కోట్లు కేటాయించింది. వేములవాడ ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు రోడ్ల విస్తరణ చేపట్టనున్నారు. రోడ్ల విస్తరణకు అవసరమైన భూసేకరణకు ప్రభుత్వం రూ.47.85 కోట్లు మంజూరు చేసింది.