తెలంగాణలో మిగిలింది స్థానిక సంస్థల ఎన్నికలే. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందుకోసమే ఇందిరమ్మ ఇళ్ల పథకంలో స్థానిక నాయకులనే భాగస్వామ్యం చేశారనే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో కొనసాగుతుంది. ఎందుకంటే.. ఈ ఎన్నికల్లో స్థానిక నాయకుల ప్రభావం కీలకంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలవాలంటే మాత్రం ఈ వ్యూహాన్ని అమలు చేయక తప్పదని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లు ప్రచారం సాగుతుంది.