తెలంగాణలో ఇంటర్ ఫలితాలు.. ఎప్పుడంటే?

54722చూసినవారు
తెలంగాణలో ఇంటర్ ఫలితాలు.. ఎప్పుడంటే?
తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫలితాలను అధికారులు త్వరలోనే విడుదల చేయనున్నారు. ఏప్రిల్ మూడోవారం లేదా చివరి వారంలో ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మూల్యాంకన ప్రక్రియ పూర్తికాగా.. తప్పులు దొర్లకుండా ఉండేందుకు మరోసారి జవాబుపత్రాలను పరిశీలిస్తున్నారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు పరీక్షలను నిర్వహించగా దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.