అక్కా తమ్ముళ్లను కలిపిన ఇన్‌స్టా రీల్‌

75చూసినవారు
అక్కా తమ్ముళ్లను కలిపిన ఇన్‌స్టా రీల్‌
యూపీలోని కాన్పూర్‌లో ఎప్పుడో చిన్నప్పుడు తప్పిపోయిన ఓ వ్యక్తి 18 ఏండ్ల తర్వాత కలిశాడు. యూపీలోని హతిపూర్‌కు చెందిన రాజ్‌కుమారి మొబైల్‌లో ఒక రీల్స్‌ వీడియో చూస్తుండగా, అందులోని వ్యక్తి 18 ఏండ్ల క్రితం ఇంట్లోంచి ముంబై వెళ్లిన తన తమ్ముడు బాల్ గోవింద్‌లా అనుమానించింది. ఇన్‌స్టాలో అతడిని సంప్రదించి చిన్నప్పడు తాను తమ్ముడితో గడిపిన విషయాలు ప్రస్తావించింది. వాటికి అతడు కూడా సరిగ్గా స్పందించడంతో అతడు తన తమ్ముడేనని నిర్ధారణ అయ్యింది.