ఇరాన్ దాడులు.. స్పందించిన ఇజ్రాయెల్ పీఎం

68చూసినవారు
ఇరాన్ దాడులు.. స్పందించిన ఇజ్రాయెల్ పీఎం
తమ దేశం మీద డ్రోన్‌లు, మిసైళ్లతో ఇరాన్ జరిపిన దాడులపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. ఇరాన్ దాడులకు ఎలా స్పందించాలనేదానిపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన వార్ క్యాబినెట్ భేటీకి వెళ్లే ముందు నెతన్యాహు మాట్లాడారు. ‘మేం అడ్డుకున్నాం. కూల్చివేశాం. కలిసికట్టుగా గెలుస్తాం’ అని ఇరాన్ డ్రోన్‌లు, మిసైళ్లను అమెరికా, బ్రిటన్ సహకారంతో కూల్చివేయడంపై ఈ విధంగా వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్