TG: ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి స్పీకర్‌ను అవమానించలేదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇవాళ హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. ‘జగదీశ్ స్పీకర్‌ను అవమానించలేదు. సభ మీ ఒక్కరిదీ కాదు.. అందరిదీ అన్నారు. మీ అనే పదం సభనిబంధనలకు విరుద్ధం కాదు. మీ ఒక్కరిదీ అనే పదం అన్పార్లమెంటరీ పదమూ కాదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు నిరసన చేశారో తెలీదు. సభను ఎందుకు వాయిదా వేశారో తెలీదు’ అని హరీశ్ అన్నారు.