ఈ నెల 8 శుక్రవారం అదనపు వరకట్న వేధింపులతో దారుణ హత్యకు గురైన పోగుల (చంద) లత అంతిమ యాత్ర మంగళవారం రేచపల్లిలో జరిగింది. ఈ అంతిమ యాత్రకు రాష్ట్ర నలు మూలల నుండి ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు తరలి వచ్చాయి. గ్రామస్తులు, జిల్లా వాసులు కూడా అధిక సంఖ్యలో ఈ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ లత హత్య పట్ల నిరసనలు తెలుపుతూ.. వరకట్నాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.