గర్భం దాల్చిందని.. కర్రలతో కొట్టి, కడుపుకోసి చంపేశారు

6321చూసినవారు
గర్భం దాల్చిందని.. కర్రలతో కొట్టి, కడుపుకోసి చంపేశారు
పెళ్లి కాకుండానే కూతురు గర్బం దాల్చిందని అత్యంత దారుణంగా హతమార్చారు. ఈ ఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో జరిగింది. కడ్తాల మండలం వెలుగురాళ్ల తండాకు చెందిన బాలిక(19) తండ్రి చనిపోవటంతో బంధువుల ఇంట్లో ఉంటుంది. ఇటీవలే ఇంటికి వచ్చిన బాలిక కడుపు ఉబ్బెత్తుగా కనిపిస్తోందని తల్లి సోనీ నిలదీసింది. గర్భం దాల్చిందని తెలియటంతో ఆగ్రహంతో ఊగిపోయింది. కుమారులు బబ్లు, జగన్‌ల సాయంతో బాలికను పొలం వద్దకు తీసుకుని వెళ్లింది. గర్భానికి కారణం ఎవరో చెప్పాలంటూ కట్టెలతో బాలిక తల, పొట్టపై తీవ్రంగా కొట్టారు. పొత్తికడుపు కోసి దారుణంగా హతమార్చారు. తర్వాత బాలిక నోట్లో పురుగులమందు పోసి పొలంలోనే పాతిపెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు నిలదీయగా గర్భం దాల్చినందుకు మందలించడంతో బాలిక సూసైడ్ చేసుకుందని నమ్మించారు. మృతదేహాన్ని బయటకుతీసి చూడగా తలపై తీవ్ర గాయాలు, పొత్తికడుపుపై కత్తితో కోసిన గుర్తులు కనిపించటంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
Job Suitcase

Jobs near you