సైఫ్‌ను కోటి రూపాయలు డిమాండ్ చేసిన దుండగుడు
ప్రముఖ సినీ నటుడు సైఫ్ అలీఖాన్‌పై జరిగి దాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముంబై బంద్రాలో సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి దూరిన దుండగుడు కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. రూ.1కోటి ఇచ్చేందుకు ఒప్పుకోకపోవడంతో సైఫ్ అలీ ఖాన్, మరో ఇద్దరు సిబ్బందిపై కత్తితో దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఇప్పటికే దుండగుడిని గుర్తించిన పోలీసులు అతడిని పట్టుకునే పనిలో ఉన్నారు.