తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు శుభవార్త అందించింది. రాష్ట్రంలోని అన్ని బీసీ స్టడీ సర్కిళ్లలో ఫిబ్రవరి 15 నుంచి RRB, SSC, బ్యాంకింగ్ రిక్రూట్‌మెంట్ పరీక్షల కోసం 100 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అభ్యర్థులు ఈ నెల 20 నుంచి ఫిబ్రవరి 9 వరకు www.tgbcstudycircle.cag.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్, డిగ్రీ పరీక్షల్లో సాధించిన మార్కులు, రిజర్వేషన్ నియమాల ప్రకారం ఎంపిక జరుగుతుంది.