బాన్సువాడ మున్సిపల్ పరిధిలోని ఒకటో వార్డు పరిధిలోని ఎన్జీవోస్ కాలనీలో గురువారం ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టులో భాగంగా డిజిటల్ కార్డు ఇంటింటి సర్వేను మున్సిపల్ అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కుటుంబ సభ్యుల యొక్క వివరాలను నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ మల్లి కార్జున్ రెడ్డి, నాయకులు అమీర్ చావుస్, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.