వాస్తవానికి హైడ్రాను నడిపిస్తున్నది సీఎం రేవంత్ కాదు.. రాహుల్‌గాంధీనే అని కేటీఆర్ ఆరోపించారు. పేదల ఇళ్లపైకి బుల్డోజర్లను పంపిస్తున్నది ఆయనే. తెలంగాణలో చిన్నపిల్లాడు పిలిచినా సరే వస్తానన్నారు ఆయన. మరి బుల్డోజర్ ప్రభుత్వంలో హైదరాబాద్ నగరంలో ప్రజలు చచ్చిపోతుంటే ఆయన ఎక్కడున్నారు? కాంగ్రెస్ అధిష్ఠానానికి మూసీ నోట్ల కట్టలు కావాలి కానీ.. మూసీ బాధితుల కష్టాలు పట్టవా? అని కేటీఆర్ ప్రశ్నించారు.