హైదరాబాద్ లో జరిగే మాలల సింహగర్జన బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బంగారు మైసయ్య కోరారు. బాన్సువాడ పట్టణంలో ఆర్అండ్ బీ అతిథి గృహంలో మాల మహానాడు, అంబేద్కర్ సంఘం నాయకులు గురువారం మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ మాల ఉపకులాలకు చాలా అన్యాయం జరుగుతుందన్నారు. మాలలు 30 లక్షలు ఉన్నాగాని మాలలను చిన్న చూపు చూస్తున్నారన్నారు.