గొర్రెలకు మేకలకు నట్టాల నివారణ శిబిరం నిర్వహణ

499చూసినవారు
గొర్రెలకు మేకలకు నట్టాల నివారణ శిబిరం నిర్వహణ
మద్నూర్ మండలం కోడిచిర గ్రామంలో మేకలకు , గొర్రెలకు నట్టాల నివారణ శిబిరం పశు వైద్యుల ద్వారా నిర్వహించడం జరిగిందని సర్పంచ్ సంతోష్ పటేల్ తెలిపారు. మంగళవారం రోజున  కోడిచిర గ్రామంలో మేకలు , గొర్రెలు ఉన్న వారు శిబిరం వద్దకు తీసుకోవచ్చి సర్పంచ్ ఆధ్వర్యంలో పశు వైద్యుడు విజయ్ బండివార్ నట్టాల నివారణ మందులు వేయడం జరిగింది. పశు వైద్యుడు విజయ్ పశువు దారులకు పలు సూచనలు , సలహాలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు మేకలు గొర్రెలు ఉన్న వారందరు తప్పకుండా నట్టాల నివారణ మందులు వేసుకొని ఆరోగ్యంగా పశువులను ఉంచుకోవాలని కోరారు. పశు వైద్యుడు విజయ్ బండివార్ యొక్క సేవాలను గ్రామస్థులు కొనియాడుతూ శాలువా తో సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంతోష్ పటేల్ , సంజయ్ , గ్రామ పశువు దారులు , పశు వైద్య సిబ్బంది పాల్గొనడం జరిగింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you