టీచర్ కాలనిలో ఘనంగా మహిళ దినోత్సవం

465చూసినవారు
టీచర్ కాలనిలో ఘనంగా మహిళ దినోత్సవం
మద్నూర్ కేంద్రంలోని టీచర్ కాలనిలో మహిళలు అందరూ కలిసి మెలిసి మహిళ దినోత్సవం వేడుకలు నిర్వహించుకోవడం జరిగిందని మండల పిఆర్టియు మహిళ అధ్యక్ష్యురాలు  జ్యోతి తెలిపారు.  మహిళ దినోత్సవం  సందర్భంగా ఎంపీటీసీ సంగీత కుషాల్ మహిళ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఉపాధ్యాయురాలు జ్యోతి వాగ్మరే గృహంలో మహిళలు కలిసి కట్టుగా నిర్వహించుకోవడం జరిగింది. ఒకరి ఒకరు తీపి పదార్థాలు తినుపించుకొని మహిళ దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుకోవడం జరిగింది. ఉపాధ్యాయురాలు జ్యోతి మాట్లాడుతూ మార్చ్ 08 నాడు ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. టీచర్ కాలనీ లో ప్రతి సంవత్సరం తోటి కుటుంబాల మహిళలు ఒక దగ్గర ఏర్పడి సమిష్టిగా అక్క చెల్లెలుగా బంధం లాగా వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుందంని తెలిపారు. మహిళలు కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ ఉద్యోగాలు, ఆయా రంగాలలో వారు విదులు నిర్వహిస్తూ వారి శ్రమకు వందనం అని తెలిపారు.  మహిళలు అందరూ మగ వారితో సమానం బాధ్యతలు, ఉద్యోగాలు, కుట్టు మిషన్ పనులు, వ్యవసాయ రంగాలలో కష్ట పడి పని చేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళలకు అన్ని రంగాలలో సమాన హక్కులు కల్పించడం తో మహిళలు కూడా రాజకీయంగా, విద్య పరంగా, ఉద్యోగ పరంగా ముందంజలో ఉన్నారని తెలిపారు.  

మహిళలు ఇంటి పని తో పాటు పిల్లల పోషణ, కుటుంబ సభ్యుల యొక్క బాధ్యతలు నిర్వహిస్తూ మహిళలు శ్రమికులుగా జీవనం గడుపుతున్నారని తెలిపారు.  మహిళల పట్ల చిన్న చూపు చూడ కుండ మహిళలకు గౌరవం ప్రాధాన్యత కల్పించాలని కోరారు.  మహిళలకు హక్కులు వారికి రక్షణ కల్పించాలని కోరారు. మహిళలు కూడా ఆయా రంగాలలో రాణించాడానికి వారికి ప్రోత్సాహం కల్పించి పెద్ద పీట వేయాలని కోరారు.  మహిళ దినోత్సవం కార్యక్రమంలో వచ్చిన వారికి  శాలువా, పుష గుచ్చం అందించి అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వాగ్మరే లక్ష్మీ బాయి , ఎంపీటీసీ సంగీత కుషాల్ , మండల పిఆర్టియు అధ్యక్ష్యురాలు జ్యోతి శివ్ శంకర్ వాగ్మరే , దైవ శిలా రాజేందర్, రూప, గంగసాగర్, రుక్మిణి, అనిత, సౌమ్య, ప్రబద్ద, లావణ్య, బాగ్యా లక్ష్మీ, జ్యోతి, వైశాలి, లావణ్య పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్